Friday, March 31, 2023

తెలంగాణకు రోల్ మోడల్ చెన్నూరు – దశ దిశ మార్చిన సుమన్: హరీష్

చెన్నూరు – తెలంగాణ రాష్ట్రానికి చెన్నూరు నియోజకవర్గ రోల్ మోడల్ గా మారిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 204 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నాలుగేళ్లలో చేసి చూపారన్నారు. చెన్నూరు నియోజకవర్గం నిధుల వరద పారుతోందని, అన్ని రంగాల్లో నియోజకవర్గ అభివృద్ధి చెంది రాష్ట్రానికి రోల్ మోడల్ గా మారడం హర్షణీయమన్నారు.

- Advertisement -
   

తెలంగాణ ఉద్యమంలో మొదటి స్థానంలో ఉన్న బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిలో సైతం మొదటి స్థానంలో ఉండడం అభినందనీయం అన్నారు. చెన్నూరు దశ, దిశ సుమన్ మార్చారని ఇలాంటి ఎమ్మెల్యే ఉండడం నియోజకవర్గం ప్రజల అదృష్టం అన్నారు. రామారావు పేట ప్రజలు గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబులను రోడ్డు కోసం అడ్డుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. రోజు 204 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగడం ప్రజలందరూ గమనించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement