Wednesday, December 6, 2023

Election Campaign – బూతులు మాట్లాడే పార్టీల‌కు బూత్ ల‌లోనే స‌మాధానం చెప్పండి..ఓట‌ర్ల‌కు హ‌రీష్ పిలుపు

నిజామాబాద్.. బోధ‌న్ – ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లుంది కాంగ్రెస్‌ పరిస్థితి అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో నమ్మితే మోసపోతామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ అర్భ‌న్, బోధన్ నియోజకవర్గంలో రోడ్ షో లో పాల్గొని ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ప్ర‌సంగించారు. బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కేసీఆర్ గెలిస్తే అందరం బాగు పడతాం.. లేదంటే అందరం బాధ పడతాం.. అని పేర్కొన్నారు.. బీజేపీ వాళ్లు పేదల కోసం ఒక్క మంచి పని అయినా చేశారా? అని మంత్రి ప్రశ్నించారు మళ్లీ బీఆర్ఎస్‌ ప్రభుత్వం రాగానే రూ. 400 లకే గ్యాస్‌ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. రైతు బీమా లాగా కోటి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందించబోతున్నామని తెలిపారు.


ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రిస్తూ … నాడు నీళ్ళ కోసం ఎంతో గోస. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద సర్కారు దవాఖాన అంటున్నారు.మోకాలు చిప్ప ఆపరేషన్లు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తున్నాం.. కరోనా వస్తె కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. గల్లీ గల్లీ తిరిగి మీ ఎమ్మెల్యే మీకు అండగా ఉన్నడు. కష్టం వచ్చినప్పుడు ఎవరు వచ్చారు, బాధలో ఎవరు ఉన్నారు, పండుగలో ఎవరు ఉన్నారు. రేషన్ షాపుల ద్వారా పాత బియ్యం, సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం అమలు చేయబోతున్నాం అంటూ వివ‌రించారు.

- Advertisement -
   

బిజెపి వాళ్ళు 400 సిలిండర్ 1200 మాత్రం చేశారు. మన ప్రభుత్వం రాగానే మళ్లీ 400 లకే సిలిండర్ ఇవ్వ్వబోతున్నాం. కేసీఆర్ రాకముందు నిజామాబాద్, బోధ‌న్ ఎలా ఉంది..ఇప్పుడెలా అభివృద్ధి చెందిదో చూడండి..రఘునాథ్ చెరువు అద్భుతంగా అభివృద్ధి చేశారు అర్బ‌న్ ఎమ్మెల్యే గణేష్ బిగాల . కేసీఆర్ గెలిస్తే అందరం బాగు పడతాం. లేదంటే అందరం బాధ పడతాం. కాంగ్రెస్ కాకమ్మ కథలు నమ్మొద్దు. మోస పోతాం. భూతు మాటల నాయకులకు, భూత్ లలోనే సమాధానం చెప్పాలి.
ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం. ఖాయం అంటూ ముగించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement