Thursday, May 16, 2024

అడవుల్లో గడ్డి క్షేత్రాల పెంపకం ఎంతో ఉపయోగకరం

జన్నారం,సెప్టెంబర్6( ప్రభ న్యూస్): అడవుల్లో గడ్డి క్షేత్రాలను పెంచడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని గడ్డి క్షేత్రాల ప్రత్యేక నిపుణుడు జి.డి మురాత్కర్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం టిడిసిలో బుధవారం కవ్వాల టైగర్ రిజర్వ్, ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి సర్కిల్ లోని డీఎఫ్ఓలకు, ఎఫ్డీఓలకు, ఎఫ్ఆర్ఓలకు, ఫీల్డ్ సిబ్బందికి గడ్డి క్షేత్రాల నిర్వాణ, ఉత్తమమైన పద్ధతులు, వాటర్ షెడ్ పర్యావరణ వ్యవస్థల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సును హైదరాబాద్ పీసీసీఎఫ్ ఎల్. జైస్వాల్, కవ్వాల ఎఫ్డీపీటీ వినోద్ కుమార్ ప్రారంభించారు. సందర్భంగా మురాత్కర్, మాట్లాడుతూ, శాఖాహార జంతువుల కోసం గడ్డి క్షేత్రాలు, నీటి వనరులను అడవుల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అడవుల్లో శాఖాహర జంతువులు పెరిగినట్లయితే వాటిపై ఆధారపడే మాంసాహార జంతువులైన పెద్ద పులులు, చిరుతపులులు ఇక్కడే ఉండి అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు. శాకాహార, మాంసాహార జంతువుల అభివృద్ధి కోసం ప్రత్యేక మెలకువలను ఆయన తెలిపారు. మూషిక జింకలను సహజ అడవుల్లో పెంపొందించడం కోసం హైదరాబాద్ జూ పార్క్ నుంచి తీసుకువచ్చి ఇక్కడ అడవుల్లో వదిలామన్నారు. ఆ మూషిక జింకలు ఎలా పెరుగుతాయో పరిశీలించనట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత తాళ్ళపేట రేంజ్ లోని మల్యాల తూర్పు బీట్ అడవుల్లోని ఏర్పాటుచేసిన ఎన్ క్లోజర్లో హైదరాబాద్ జూ పార్క్ నుంచి తేచ్చిన 20 మూషిక జింకలను, 6 మచ్చల జింకలను జైస్వాల్ విడుదల చేశారు

. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిఎఫ్ఓ ఆశీష్, స్థానిక డిప్యూటీ కన్జర్వేవేటర్ఎస్. మాధవరావు, నిర్మల్ డిఎఫ్ఓ రాంకిషన్, ఇందన్ పల్లి, తాల్లపేట రేంజ్ ఆఫీసర్లు హఫీజోద్దీన్, పి.పోచమల్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement