Monday, April 29, 2024

ఈ నెల 30న జీఆర్‌ఎంబీ సబ్‌కమిటీ భేటీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సబ్‌ కమిటీ సమావేశం ఈ నెల 30న జరగనుంది. చనఖా కొరటా బ్యారేజీ, మోదికుంట ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు రావడం,తోపాటు పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన జలాల కంటే ఏపీ ఎక్కువగా వాడుకుంటోందని తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ నెల 30న జరిగే జీఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నీటికంటే ఏపీ ఎక్కువగా వాడుకుంటోందని ఇటీవల కొద్ది రోజుల కిందట తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ జీఆర్‌ఎంబీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు 30న సమావేశానికి హాజరుకావాలని తెలుగు రాష్ట్రాలకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాతో రావాలని లేఖలో జీఆర్‌ఎంబీ కోరింది. పోలవరంతోపాటు డీపీఆర్‌ల ఆమోదం కోసం ఎదురు చూస్తున్న ఆరు ప్రాజెక్టుల విషయాన్ని కూడా జీఆర్‌ఎంబీ ఎదుట తెలంగాణ ప్రస్తావించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement