Tuesday, May 7, 2024

TS | కానిస్టేబుల్‌ నియామకలకు గ్రీన్‌ సిగ్నల్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు 15,516 వేల మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. టీఎస్‌ఎల్ఫీఆర్బీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కు తీర్పు సానుకూలంగా వచ్చినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్‌ 4న ప్రకటించిన కానిస్టేబుల్‌ ఫలితాలనే ఫైనల్‌ చేస్తూ రెండు రోజుల్లో టీఎస్‌ఎల్‌ఆర్బీ తుది ప్రకటన చేయనుంది. ప్రశ్నాపత్రంలో తప్పొప్పులపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్‌ బెంజ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ బోర్డు అధికారులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసు, జైళ్లు, అగ్నిమాపక, ట్రాన్స్‌ పోర్టు, ఎక్సైజ్‌ శాఖల అధికారులకు టీఎస్‌ఎల్‌పీఆర్బీ గతేడాది అక్టోబర్‌ 4న ఇచ్చిన తుది ఫలితాలు ఫైనల్‌ అంటు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయా విభాగాల నియామక పత్రాలు తయారు చేసుకోవాలంటూ రాష్ట్ర హోంశాఖకు రహష్యంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఉన్నతాధికారులకు సెలక్ట్‌ అయిన అభ్యర్థల వివరాల జాబిత, ఇతర లేఖలు వెళ్లాయి.

డ్రైవర్‌ మెకానిక్‌ పోస్టులకూ లైన్‌ క్లియర్‌ అయినట్లు విశ్వసనీనయ సమాచారం. ఈక్రమంలో సుప్రీం వాదనల సందర్భంగా నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి తుది ఫలితాలు విడుదలయ్యే వరకు అన్నింటినీ పద్దతి ప్రకారం నిర్వహించామని, సాంకేతికంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకున్నామని బోర్డు తరపు న్యాయవాది వివరించారు. దీంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టుకూడా బోర్డు వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పుకుండా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ గడువు కూడా దగ్గరపడుతుండటంతో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకే కట్టుబడి ఉందని తెలిసింది.

ఈనెల 12 నుంచి నియామక పత్రాలు.!

ఈనెల 12వ తేదీ నుంచి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 12 నుంచే నియామక పత్రాలు ఇచ్చేలా ప్రింటింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎంవో, హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈనెల 12న ఎంపికైన అభ్యర్థలకు నియామక పత్రాలను అందించనున్నారని సమాచారం. కాగా ఈనెల 17వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది 2022 ఏప్రిల్లో గత ప్రభుత్వం. వీటిలో 587 ఎస్సై , తత్సాన ఉద్యోగాలు, 16,604 కానిస్టేబుల్‌ తత్సమాన ఉద్యోగాలు ఉన్నాయి.

- Advertisement -

ఇది జరిగింది:

గత ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో మొత్తం 17,516 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటిల్లో 587 ఎస్‌ఐ, 16,604 కానిస్టేబుల్‌ తత్సమాన ఉద్యోగాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్‌ నుంచి 587 ఎస్సై ఉద్యోగాలకు టీఎస్‌ఎల్‌పీఆర్బీ బోర్డు వివిధ దశల్లోపరీక్షలు నిర్వహించి, గత ఏడాది ఆగస్టులోనే తుది ఫలితాలను వెల్లడించింది. దీంతో ఎస్సై ఉద్యోగాలకు ఎంపికైన 587 మంది అభ్యర్థులు రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. అభ్యర్థుల నియామక ప్రక్రియ 2022 ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైంది. తుది పరీక్షలో వచ్చిన ట్రాన్స్‌లేషన్‌ ప్రశ్నల వరకు చాలా సందర్భాల్లో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయినా, టీఎస్‌ఎల్‌పీఆ ర్బీ ఎప్పటికప్పుడు హైకోర్టు సూచనలు పాటిస్తూ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను కొనసాగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement