Tuesday, April 30, 2024

TS : ఈ సారైన ఓటింగ్ శాతం పెర‌గాలి.. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

హైదరాబాద్ నగరంలో ఎప్పుడు 40 శాతానికి మించి ఓటింగ్ శాతం నమోదు కావ‌డం లేద‌ని కిషన్ రెడ్డి అన్నారు. మనం దృష్టి సారించాలి ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలన్నారు. అంబర్ పేట్ నియోజకవర్గం కాచిగూడ డివిజన్ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ పోలింగ్​ లో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. ఈసారి దేశం, భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కోరారు. దేశాభివృద్ధి కోసం ఓటు వేయాల‌ని దీంతో మన భవిష్యత్త్ కూడా బాగుపడుతుందన్నారు.
2014కు ముందు 50 ఏళ్లు దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించింద‌ని అంటూ ఆ తర్వాత మోడీ దేశంలో ఎలాంటి మార్పులు తీసుకోచ్చారో చూడండి అని ఆయన పేర్కొన్నారు. అవినీతి రహిత పరిపాలన అందించిన మోడీ ప్రభుత్వ లక్ష్యమ‌న్నారు. దేశ భద్రతను, దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేశార‌న్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీఠ వేసారు అంటూ వెల్లడించారు.

ప్రతి ఒక్కరు ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి అని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలు మన హైదరాబాద్ నగరంలో ఏ విధంగా బలపడ్డాయో అందరికి తెలుస‌న్నారు. .. లుంబినీ పార్కు, గోకుల్​ ఛాట్​, దిల్​ షుక్​ నగర్ లాంటి ప్రదేశాల్లో మన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నార‌ని, .. కర్ఫ్యూలు, మతకల్లాలు, బాంబుపేలుళ్లు ఉండేవన్నారు. కానీ, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి బాంబుదాడులు లేవని పేర్కొన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఐదో ఆర్థిక అతి పెద్ద దేశంగా తీర్చిదిద్దారని ఆయన తెలిపారు.

యూకే లాంటి దేశాలను కూడా వెనక్కి నెట్టేసి ఐదో స్థానంలోకి రావడం అభినందనీయమన్నారు. క్రమశిక్షణతోనే ఆర్థికంగా బలపడ్డామన్నారు. డిజిటల్​ ట్రాన్జేక్షన్​ చాలావరకూ పెరిగిందన్నారు. ఈ దేశంలో నిరక్ష్యరాస్యత ఉందని కాంగ్రెస్​ నాయకులు మాట్లాడారని అన్నారు. కానీ ఈ రోజు ప్రతీ చిన్న దుకాణంలో సాంకేతిక లావాదేవీలు పెరిగాయన్నారు. సాంకేతికతో ఆర్థిక లావాదేవీల్లో అమెరికాను కూడా మించిపోయామన్నారు. ఇక, రామ జన్మ భూమి, ఆర్టికల్​ 370, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. సైనిక, ఆర్మీలో మహిళలకు అవకాశం కల్పించామని కిషన్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement