Sunday, April 28, 2024

National : నవనీత్ కౌర్ ఎస్సీనే….సుప్రీంకోర్టు

మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా కుల నిర్ధారణ సర్టిఫికెట్ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. నవనీత్ రాణా 2019లో ఎస్సీ కేటగిరిలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. కాకపోతే ఈ విషయంలో నవనీత్ రానా అందించిన ఎస్సీ సర్టిఫికెట్లు సరైనవి కాదని కొందరు బాంబే హైకోర్టులో కేసు వేశారు.

- Advertisement -

ఈ విషయం సంబంధించి అప్పట్లో అయితే చర్చ జరిగింది. ఇందులో భాగంగానే కోర్టు ఆవిడకు రెండు లక్షల జరిమానాను కూడా విధించింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఆమెకు అనుకూలంగా రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇందుకు సంబంధించి అనేక విషయాలలో దర్యాప్తు చేపించిన కోర్టు చివరికి నవనీత్ కౌర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

తాజాగా నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది సుప్రీంకోర్టు. జూన్ 8, 2021న, ‘మోచి’ కుల ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించి మోసపూరితంగా పొందిందని హైకోర్టు అప్పట్లో పేర్కొంది. దీనితో ఎంపీ నవనీత్ రాణాకి రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది. నవనీత్ రాణా ‘సిక్కు-చామర్’ కులానికి చెందినదని రికార్డులు సూచిస్తున్నాయి. అయితే తాజా తీర్పుతో అవేవి నిజం కాదని తేల్చేసింది. ఇకపోతే ఇటీవల నవనీత్ కౌర్ బీజేపీ లో చేరింది. ఈ సారి కూడా మహారాష్ట్రలోని అమరావతి నుంచి బీజేపీ అభ్యర్ధిగా నవనీత్ కౌర్ పోటీ చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement