Sunday, April 28, 2024

TS: ఆర్టీసీ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్..

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన శనివారం బస్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… జూన్ 1వ తేదీ నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమలవుతుందని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. 2017లో నాటి ప్రభుత్వం 16 శాతం పీఆర్సీ ఇచ్చిందని మళ్లీ ఇవ్వలేదని గుర్తు చేశారు. అందుకే ఈసారి 21 శాతం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కొత్త పీఆర్సీతో ఆర్టీసీపై నెలకు రూ.35కోట్లు… ఏడాదికి రూ.418 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందన్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణ ఆర్టీసీలోని 53 వేలకు పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఇక‌ తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహాలక్మి పథకం అమలు చేశామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ పథకం విజయవంతంగా సాగుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement