Friday, May 17, 2024

HYD : సామ రంగారెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. వనస్థలిపురం కార్పోరేటర్ రాగుల వేంకటేశ్వర రెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 15(ప్రభ న్యూస్) 16 సంవత్సరాలుగా ఎల్బీనగర్ ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తున్న బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డికి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రావుల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.

వనస్థలిపురం డివిజన్ కార్పోరేటర్ రాగుల వేంకటేశ్వర రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి కి మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు వేసి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రశాంత్ నగర్ కాలనీ వాసులను స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో కోరారు. ఈ కార్యక్రమంలో తడకమళ్ళ విజయ్ కుమార్, కొత్త రవీందర్ గౌడ్, ప్రశాంత్ నగర్ కాలనీ కార్యదర్శి బాలాజీ నాథ్, కాలనీ సంక్షేమ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement