Sunday, February 25, 2024

NZB: తమ్ముడిపై అన్న కత్తెరతో దాడి..

నిజామాబాద్ సిటీ, నవంబర్ 15 (ప్రభ న్యూస్): సొంత తమ్ముడిపై అన్న కత్తెరతో దాడికి పాల్పడ్డ ఘటన ఇవాళ ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 3వ పోలీస్ స్టేషన్ పరిధిలో నాందేవాడకు చెందిన మద్యానికి బానిసైన హనుమంతు అనే వ్యక్తి తన సొంత తమ్ముడు అయిన భీమ్ రావ్ ఇంటికి వచ్చాడు.

అక్కడ అన్నదమ్ముల మధ్య డబ్బుల కోసం మాటమాట పెరగడంతో అన్న హనుమంతు కోపంతో తమ్ముడు అయిన భీమ్ రావ్ ని కత్తెరతో పొడిచాడు. అనంతరం చుట్టుపక్కల వారు చేరడంతో, అన్న భీమ్ రావ్ అదే కత్తెరతో తనకు తాను పొడుచుకున్నట్లు సమాచారం. స్థానికులు హుటహుటిన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇరువురు అన్నదమ్ములు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement