Saturday, May 4, 2024

బొజ్జ గ‌ణ‌పయ్యా…..నీ మ‌ట్టి విగ్ర‌హాలు ఎక్క‌డ‌య్యా….

నాగోల్ సెప్టెంబరు 14(ప్రభ న్యూస్) – వినాయక చవితి సమీపిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో యువత మండపాల నిర్మాణంలో నిమగ్నమైంది. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి, విగ్రహాల కొనుగోలుపై దృష్టి పెడుతున్నారు. అక్కడక్కడ కొనుగోళ్లు పూర్తి చేసి తరలిస్తు న్నారు. చాలామంది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వైపే మొగ్గు చూపుతున్నారని నాగోల్ లో తయారీదారులు అంటున్నారు. రసాయన రంగులతో కూడిన విగ్రహాలని యోగం వల్ల కలిగే నష్టాలపై ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రజ అవగాహన కల్పిస్తోంది. కానీ ఈ ఏడాది నేటి వరకు ఏవిధమైన ప్రజా అవగాహన కార్యక్రమాలు ప్రారంభించలేదు.

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గతేడాది మట్టి విగ్రహాల పై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎల్బీనగర్ లోని మూడు సర్కిళ్ల పరిధిలో ముందస్తుగా మహిళ సంఘాల సభ్యులకు మట్టి విగ్ర హాల తయారీలో శిక్షణ ఇచ్చారు. కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ ఏడాది ఆ ఉసే లేదు. మట్టి విగ్రహాల ను ఎక్కడ కూడ పంపిణీ లేదు. మట్టి వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించాలని ప్రజలకు సూచించారు. మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ఏడాది ఏవిధమైన కార్యక్రమాలు లేవు. అధికారుల ప్రచారం లేక పోవడంతో ప్రజలు మార్కెట్ లో విస్తృతంగా లభిస్తున్న పీవోపీ విగ్రహాల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. తద్వారా జలాశ యాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది.

మట్టి విగ్రహాలు సైతం వివిధ ఆకృతుల్లో అందంగా లభిస్తున్నాయి. అయినా యువత పీవోపీ విగ్రహాల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రచారం కల్పించాల్సిన సర్కిల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నా… స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రజలకు అవగాహన కల్పించి, మట్టి విగ్రహాలు ప్రతిష్టించేలా చూడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement