Wednesday, May 15, 2024

తెలంగాణ నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ : మంత్రి గంగుల

తెలంగాణ నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ 1.25లక్షల మంది నిరుద్యోగులకు కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 16బీసీ స్టడీ సర్కిల్ లో ప్రత్యక్ష తరగతులతో కోచింగ్ ఇస్తున్నారన్నారు. 50వేల మందికి ఆన్ లైన్ కోచింగ్ ఉంటుందని తెలిపారు. కోచింగ్ తో పాటు గ్రూప్ 1, 2 అభ్యర్థులకు స్టైఫండ్, గ్రూఫ్ 1 అభ్యర్థులకు 6నెలలు స్టైఫండ్ రూ.5వేలు, గ్రూఫ్ 2 అభ్యర్థులకు మూడు నెలల స్టైఫండ్ రూ.2వేలు, ఎస్ఐ అభ్యర్థులకు రూ.2వేలు స్టైఫండ్ ఉంటుందన్నారు. ఈనెల 16 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement