మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్‌దరా వద్ద ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. బాధితుల్లో ఆరుగురు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులని చెప్పారు. వారిలో ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి (టీ)కి చెందినవారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.
- Advertisement -