Friday, May 3, 2024

Follow Up : భారీ వర్షాల నేపథ్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన రద్దు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన రద్దయింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆమె పర్యటన రద్దయినట్లు ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ముర్ము మంగళవారం సాయంత్రం గం. 5.30 లకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యుడితో సమావేశమవుతారు. అనంతరం కత్రియా హోటల్‌లో జరుగనున్న మేధావుల సమావేశంలో ప్రసంగిస్తారని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో గడచిన మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటం, రాబోయే మూడు రోజులు కూడా భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముర్ము పర్యటన రద్దయినట్లు పేర్కొన్నారు.

ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన ద్రౌపది ముర్ముకు ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం పలకడంతోభారీ భారీ సన్మా కార్యక్రమం, ఊరేగింపు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసింది. ముర్ము ఆహ్వానం, సన్మాన కార్యక్రమం తదితర వాటిపై బీజేపీ నేతలు సమావేశం కూడా అయ్యారు. అయితే చివరి నిమిషంలో ముర్ము పర్యటన రద్దయిందని తెలియడంతో నీరసించిపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement