Tuesday, May 28, 2024

మన ఊరు – మన బడి టెండర్లపై హైకోర్టులో విచారణ.. రద్దు చేసినట్లు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మన ఊరు – మన బడి టెండర్లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మన ఊరు – మన బడి టెండర్ల కేటాయింపులలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మన ఊరు – మన బడి కోసం మొత్తం నాలుగు టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది.

వీటిల్లో రెండు టెండర్లపై ఈ రోజు (సోమవారం) హైకోర్టులో విచారణ జరిగింది. మరో రెండు టెండర్లను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మిగతా రెండు టెండర్లపై ఈ నెల 21న విచారణ జరుపనున్నట్లు హైకోర్టు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement