Sunday, May 5, 2024

Crime : హైదరాబాద్‌ శామీర్‌పేట్‌లో కాల్పుల కలకలం..

హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలోని శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సిద్ధార్థ్‌దాస్‌ అనే యువకుడిపై మరో వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్‌దాస్‌ అనే యువకుడిపై యాక్టర్ మనోజ్ నాయుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే కాల్పులకు దారితీసినట్లుగా సమాచారం. సిద్దార్థ్ భార్యతో సెలబ్రిటీ క్లబ్ లో మనోజ్ నాయుడు కలిసి ఉన్నారు.

విషయం తెలుసుకున్న సిద్దార్థ్ దాస్ సెలబ్రిటీ క్లబ్ కు వెళ్లాడు. దీంతో అక్కడ వివాహేతర సంబంధంపై ముగ్గురి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.విచక్షణ కోల్పోయిన మనోజ్ నాయుడు ఎయిర్ గన్ తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తప్పించుకున్న సిద్దార్థ్ దాస్ ఘటనపై శామీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement