Sunday, April 28, 2024

TS : ఆయిల్ గోడౌన్‌లో అగ్నిప్ర‌మాదం…

హైద‌రాబాద్‌లో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. అర్థ‌రాత్రి టోలిచౌకిలోని ఓ ఆయిల్ గోడౌన్‌లో సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభ‌వించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండగా.. సుమారు 7 ఫైరింజన్లు ఆర్పేందుకు ప్రయత్నించాయి.

- Advertisement -

అగ్ని ప్రమాదం తెలియడంతో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, బల్దియా అధికారులతో మాట్లాడారు. ఆయా శాఖలో అధికారులు వెంటనే అక్కడికి చేరారు. ఫైర్ ఇంజన్లలో వాటర్ అయిపోవడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యే కౌసర్ వెంటనే జలమండలి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నీళ్లను తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినా.. ఎలాంటి ప్రాణం నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. టోలిచౌకి లోని మెయిన్ రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement