Sunday, April 28, 2024

TS : ప‌త్తి మిల్లులో అగ్నిప్ర‌మాదం.. 8కోట్ల న‌ష్టం…

మక్తల్, మార్చి24(ప్రభన్యూస్) :షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కాటన్ జిన్నింగ్ మిల్లు లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని దాదాపు 8 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిన సంఘటన ఇవాళ తెల్లవారుజామున నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లో చోటుచేసుకుంది. మాగనూరు మండలంలోని దాసరి దొడ్డి రోడ్డం వద్ద వడ్వాట్ రోడ్ లోని బసవేశ్వర కాటన్ జిన్నింగ్ మిల్లులో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

- Advertisement -

పెట్రోలింగ్ వెళ్ళిన పోలీస్ సిబ్బంది కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదాన్ని గుర్తించి ఫైర్ స్టేషన్​కు సమాచారం అందించారు. మక్తల్ తోపాటు నారాయణ పేట నుండి ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే లోపే మిల్లులో నిల్వ ఉంచిన పత్తి, పత్తి గింజలతో పాటు మిషనరీ పూర్తిగా కాలిపోయింది. మిల్లు యజమానులకు ఫోన్ చేసినప్పటికీ వారి నుండి ఆలస్యంగా సమాధానం రావడంతో అప్పటికే జరగాల్సిన నష్టమంత జరిగిపోయింది.ఈ ప్రమాదంలో సుమారు రూ. 8 కోట్ల నష్టం వాటిలినట్లు మిల్లు యజమాని దండే తమ్మన్న తెలిపారు. మక్తల్ సీఐ చంద్రశేఖర్ ఎస్సై వై .భాగ్యలక్ష్మి రెడ్డి, మాగనూరు మక్తల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇవాళ ఉదయం బసవేశ్వర కాటన్ జిన్నింగ్ మిల్లును సందర్శించి ప్రమాద సంఘటనను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని అధైర్య పడ్డవద్దని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement