Friday, May 17, 2024

Ameerpet : మ‌రో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు..

హైద‌రాబాద్‌లో మ‌రో రెండు చోట్లు అగ్నిప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి. అమీర్‌పేట్‌, పాతబస్తీల్లో ఈ తెల్లవారుజామున వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్‌పేట్‌ పరిధిలోని మధురానగర్‌లోగల ఓ ఫర్నీచర్‌ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గోదాంలోని లక్షల విలువైన ఫర్నీచర్‌ కాలి బూడిదైంది.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అదేవిధంగా పాతబస్తీలో కూడా ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాతబస్తీలోని షాలిబండ ఏరియాలోగల బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దుకాణంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఫర్నీచర్ దగ్ధం కాగా స‌మాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement