Saturday, March 2, 2024

Srisilam : శైవక్షేత్రంలోభక్తుల ర‌ద్దీ…స్ప‌ర్శ ద‌ర్శ‌న‌లు ర‌ద్దు

శ్రీశైలం దేవస్థానం భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు అధికారులు స్వామివారి ఆలయంలో నిర్వహించే గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో స్వామివారి స్పర్శ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్చేసుకోవాలని శ్రీశైలం ఆలయం ఈవో పెద్దిరాజు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement