Monday, May 6, 2024

Secundrabad – పాలికా బజార్ లో అగ్ని ప్రమాదం … వస్త్ర దుకాణం బుగ్గి..

సికింద్రాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలికా బజార్‌లో ధమాకా సేల్ రెడీమేడ్ బట్టల షాప్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు రావడంతో చుట్టుప్రక్కల నివసించే వారు ప్రాణ భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు. దాని చుట్టుపక్కల మరిన్ని దుకాణాలతో పాటు లాడ్జీలు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. షాట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా, ప్ర‌మాద వార్త తెలిసిన వెంట‌నే మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ అక్క‌డికి చేరుకున్నారు.. స‌హాయ కార్య‌క్ర‌మాల‌లో పాలు పంచుకున్నారు.. ప్రమాద వివ‌రాల‌ను తెలుసుకున్నారు.. బాధిత వ్యాపారుల‌ను ప‌రామర్శించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement