Saturday, April 27, 2024

TS: పంట‌నష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకోవాలి… జ‌గ‌దీష్ రెడ్డి

సూర్యాపేట: సాగునీరంద‌క పంట న‌ష్ట‌పోయిన రైతులంద‌రినీ ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి కోరారు. సూర్యాపేట మండలం రేఖ్యా తండా, దుబ్బ తండాలో ఎండిపోయిన పంట పొలాలను మాజీమంత్రి ,నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప‌రిశీలించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ప్రభుత్వం రైతులకు ఎస్సారెస్పీ పేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశార‌న్నారు. రైతులకు స్పష్టమైన హామీ లభించిన తర్వాతే వేసిన పంటలకు నీరు ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేసిందన్నారు.

ఒక్కో రైతు రూ.25వేల నుండి రూ.30 వేల పెట్టుబడి పెట్టి ఆగమయ్యారన్నారు. ప్రభుత్వం అవగాహన రాహిత్యం వల్ల రైతులు రోడ్డు మీద పడ్డారన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో కేసీఆర్ రైతాంగాన్ని సస్యశ్యామలం చేస్తే మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యింద‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ మంత్రులు కనీసం సమీక్ష చేయడం లేదన్నారు. పంట నష్టంపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని జ‌గ‌దీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement