Monday, April 29, 2024

రుణమాఫీ ప్రకటనతో అన్నదాతల సంబరాలు – కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు ..

నిజాంబాద్ ఉమ్మడి జిల్లాలో గ్రామ గ్రామాన రైతన్నలు సంబరాలు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పడిన విపత్కర పరిస్థితులతో 75 వేల రూపాయల లోపు రుణాలను గతంలోనే మాఫీ చేశారు. లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు కేసిఆర్ ప్రకటన చేశారు. ముఖ్య మంత్రి రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కొంత ఆలస్యం కావడంతో కొంతమంది రైతులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రుణమాఫీ ప్రక్రియ ప్రభుత్వం కార్యరూపం దాల్చడంతో రైతన్నలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో గ్రామ గ్రామాన రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే వరకు బిఆర్ఎస్ పార్టీ వెంటే రైతులు ఉంటామని తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. నిజాంబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని వర్ని కోటగిరి రుద్రూరు బాన్సువాడ చందూర్ మోసర తదితర మండలాల్లో స్థానిక రైతాంగం ముఖ్యమంత్రి తో పాటు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కోటగిరి మండలంలోని దోమలేడిగి, కల్లూరు కొడిచర్ల జల్లపల్లి, తదితర గ్రామాల్లో ఉదయాన్నే రైతులు సంబరాలు చేసుకున్నారు.

బాన్సువాడలో…

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం 2018 ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకుఇది వరకు చేసిన ఋణ మాఫీ పోను మిగిలిన రైతులకు ఒక లక్ష రూపాయల వరకు ఉన్న ఋణ మాఫీ నీ పూర్తి చేయనున్నట్లు ప్రకటన చేయడంతో పాటు,అందుకు 19000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినందుకు ఈరోజు బాన్సువాడ మండలం పరిధిలోని కొల్లూరు,నాగారం గ్రామాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటాలకు బాన్సువాడ ఎంపిపి శ్రీమతి దొడ్ల నీరజా వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొల్లూరు గ్రామ సర్పంచ్ తుకారాం,నాగారం సర్పంచ్ రాచప్ప,ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు,నాయకులు, రైతు సంఘాల నాయకులు, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement