Tuesday, May 21, 2024

నీళ్ల‌లో పంట – అన్నదాత ఆత్మహత్యయత్నం..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయా రు. ఆరుగాలం పాటు కష్టపడి వ్యయా ప్రయాసల కోర్చి పండించిన పంట కళ్ళముందే వడగండ్ల వానతో నీళ్ల పాలు కావడంతో మనస్థాపానికి గురైన ఓ రైతు ఆత్మహ త్యయ త్నం చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం, అవుసుల తండాలో చెంద్యా నాయక్ అనే రైతు మూడు ఎకరాల్లో వరి పంట వేశాడు. వడగండ్ల వానతో చేతికొచ్చిన పంట నీళ్ల పాలైంది. అప్పులు చేసి పండించిన పంట నష్టపో వడంతో ఆవేదనకు గురై చెంద్యా నాయక్ అనే రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే రైతుని బాన్సువాడ ఏరియా ఆసు పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం రైతు ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నాడు.

అకాల వర్షాలు కురుస్తాయని ముందస్తుగానే వాతావ రణం శాఖ వెల్లడించిన వ్యవసాయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకు న్నారు? వ్యవసాయ అధికారులు మొద్దు నిద్ర వీడాలి. ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతన్నల పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అకాల వర్షాలతో… వడగండ్ల వానతో పంట నష్టపో యిన రైతుల వివరాలను వెంటనే సేకరించి వారికి పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతు న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం… మేము అండగా ఉన్నామంటూ మనో ధైర్యం కల్పించేలా వ్యవసాయ అధికా రులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement