Sunday, May 5, 2024

False Case – అక్ర‌మ కేసులు న‌మోదు చేసిన న‌ర్మెట్ట సిఐ నాగ‌బాబు, ఎస్ ఐ అనిల్ లు సస్పెండ్

వ‌రంగ‌ల్ – భూ సమస్య విషయంలో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి బాధిత వ్యతిరేకులకు భూమిని స్వాధీనం పర్చేందుకు యత్నించిన నర్మెట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగబాబు, నర్మెట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ వి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భూతగాదా విషయంలో గత ముప్పై సంవత్సరాలుగా బాధితుల స్వాధీనంలో ఉన్న భూమిని కేవలం ధరణి పోర్టల్ ఉన్నది అన్న సాకును చూపిస్తూ పోలీస్ ద్వారా భూ కబ్జాదారులకు బాధితుల భూమిని ఇప్పించెందుకు స్థానిక సర్కిల్ ఇన్స్ స్పెక్టర్, ఎస్.ఐ కబ్జాదారులకు సహాయ, సహాకారాలు అందజేయడంతో పాటు బాధితుల పై అక్రమం కేసులు నమోదు చేయడంతో బాధితులు పోలీస్ కమిషనర్ కుఫిర్యాదు చేశారు .

ఈ ఫిర్యాదు పై స్పందించిన పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లోని డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించారు. స్థానిక ప్రజల వాంగ్మూలం ఆధారంగా బాధితులను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు బాధిత వ్యతిరేకులకు స్థానిక సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ నాగ‌బాబు, ఎస్.ఐ అనిల్ లు సహకరించినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో ఈ ఇరువురిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ రంగ‌నాధ్ ఉత్తర్వులు శనివారం జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement