Monday, May 6, 2024

జుక్కల్ లో ప్రతీ కార్యకర్త ఎమ్మెల్యేనే : ఎమ్మెల్యే హనుమంతు షిండే

బిచ్కుంద, ఏప్రిల్ 12 (ప్రభ న్యూస్) : కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మార్కెట్ కమిటీ సమావేశానికి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే నే అని తన నియోజకవర్గంలోని ప్రజలందరూ తనవారిగానే తాను భావిస్తానని ఎన్నికల సందర్భంలోనే తాము రాజకీయాలు చేస్తామన్నారు. మా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గానే భావించి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే సమావేశంలో సూచించారు. బిచ్కుంద మార్కెట్ కమిటీ ఆవరణలో నూతనంగా మార్కెట్ కమిటీ పాలకవర్గం సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క కార్యకర్త నేను ఎమ్మెల్యేను అనుకుంటే అభివృద్ధితో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవచ్చు అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ ఒక్క కార్యకర్త నేనే ఎమ్మెల్యేను ఎన్నికల్లో గెలిపించుకుంటే గెలుపు తర్వాత పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశాను. ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేశానంటూ గెలుపొందిన ఎమ్మెల్యేకు మా గ్రామానికి అభివృద్ధి పనులు విషయంలో కానీ, గ్రామ అభివృద్ధి కోసం కానీ కొట్లాడి తామే ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసుకోవచ్చని కార్యకర్తలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు అభివృద్ధితో పాటు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. నాటి స్వర్గీయ ఎన్ శ్రీహరి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి జుక్క‌ల్ నియోజకవర్గంలో ఎంతగానో పార్టీని నమ్ముకుని కార్యకర్తలే కుటుంబ సభ్యులుగా భావించార‌న్నారు.

శ్రీహరి కుటుంబంకు ఎంతగానో రుణపడి వారి కుటుంబం నుంచి పార్టీ కోసం సేవ చేసిన వారికి ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేశానని ఆయన అన్నారు. అదేవిధంగా పార్టీ అధ్యక్ష పదవి ఎంపీపీ అశోక్ పటేల్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని వారికి కూడా ఎంపీపీ పదవి కట్టబడడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన జడ్పిటిసి నాల్చారి భారతి రాజు గెలుపు కోసం కృషిచేసిన ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ గా నాగనాథ్ పటేల్ పత్లాపూర్ కు బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి ఇవ్వ‌డం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని గత ప్రభుత్వంలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే పదవులు దక్కేదని ప్రస్తుతం మార్కెట్ కమిటీలను అన్ని వర్గాల ప్రజలకి పదవులను కట్టబెడుతూ నేడు మహిళలకు కూడా వంటింటికే పరిమితం కాకుండా 50% రిజర్వేషన్ పాలకవర్గంలో తీసుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆయన పేర్కొన్నారు. నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ మాట్లాడుతూ.. నాకు బాధ్యతలు అప్పజెప్పిన జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పిస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ తెలిపారు. కార్యక్రమంలో బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పిటిసి భారతి రాజు, మాజీ జెడ్పిటిసి సందీ సాయిరాం , మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజు పటేల్, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాలకవర్గం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement