Wednesday, May 1, 2024

TS: ప్రాణంపోయినా.. ధరణిని తొలగించే పరిస్థితి లేదు.. కేసీఆర్

ప్రాణంపోయినా ధరణిని తీసే పరిస్థితి లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జనగామలో నిర్వహించిన  ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ… రైతుల భూములను టచ్ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. జనగామకు నర్సింగ్, మెడికల్ కాలేజీ ఇస్తామన్నారు. జనగామలో అన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో జనగామలో దారుణ పరిస్థితులు ఉండేవన్నారు. అప్పటి పరిస్థితులు చూసి కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. మంచి, చెడు ఆలోచించి ఓట్లు వేయండన్నారు. ఎన్నికలు రాగానే కనిపించే వాళ్లను నమ్మొద్దన్నారు. రైతుల బాధలు తనకు తెలుసన్నారు. కాంగ్రెస్ నేతలు కరెంట్ మూడు గంటలే ఇస్తామన్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement