Thursday, May 2, 2024

Cyclone | తెలంగాణపై “మిగ్​జాం” ప్రభావం.. రెడ్ అల‌ర్ట్ జారీ !

మిగ్‌జాం తుఫాను తీవ్రంగా బలపడడంతో దాని ప్రభావం తెలంగాణపై పడింది. దీంతో భారత వాతావరణ శాఖ (IMD), తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్ప‌టికే రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇక, రేపు (మంగళవారం) కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది.

రేపు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశముందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement