Tuesday, May 7, 2024

Education: ఏంబీఏ కంటే.. ఎంసీఏకే డిమాండ్‌.. 98శాతం సీట్ల భర్తీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఐసెట్‌-2021 ప్రవేశాలకు సంబంధించి స్పెషల్‌ రౌండ్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఐసెట్‌ సీట్లు మొత్తం కలిపి 27,828 సీట్లుండగా వాటిలో ఇప్పటి వరకు 22741 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం సీట్లల్లో ఎంబీఏ సీట్లు 25252 కాగా, ఎంసీఏ సీట్లు 2576 ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఎంబీఏ సీట్లు 20201 (79.99 శాతం) నిండగా, ఎంసీఏ సీట్లు 2540 (98.60 శాతం) నిండాయి. స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ తర్వాత ఇంకా 5051 ఎంబీఏ సీట్లు, 36 ఎంసీఏ సీట్లు ఖాళీగా మిగిలాయి. వంద శాతం సీట్లు నిండిన 23 విద్యా సంస్థల్లో 12 యూనివర్సిటీలు కాగా, 11 ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం ఒక్క కాలేజీలోనే మాత్రం ఇంత వరకు ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు.

కోర్సుల పరంగా చూసు కుంటే చాలా మంది అభ్యర్థులు ఎంబీఏ కోర్సునే ఎంచుకున్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీలు 20 ఉన్నాయి. అందులో 1501 ఎంబీఏ సీట్లకు గానూ 1287 సీట్ల కేటాయింపులు జరగగా, ఇంకా 214 సీట్లు మిగిలాయి. 2 ప్రైవేట్‌ యూని వర్సిటీల్లో 186 ఎంబీఏ సీట్లకు 137 సీట్లు కేటాయింపులు జరిగగా, ఇంకా 49 సీట్లు ఖాళీగా మిగిలాయి. ప్రైవేట్‌ కాలేజీలు 242 ఉండగా, వాటిలో 23565 సీట్లకు 18777 సీట్లు భర్తీ కాగా, ఇంకా 4788 సీట్లు మిగిలాయి. మొత్తంగా 264 కాలేజీల్లో 25252 సీట్లల్లో 20201 (79.99శాతం) సీట్లు నిండగా, ఇంకా 5051 సీట్లు మిగిలాయి. రాష్ట్రంలోని 42 ఎంసీఏ కాలేజీల్లో మొత్తం సీట్లు 2576 ఉంటే, అందు లో 2540 (98.60 శాతం) సీట్లు కేటాయింపులు జరిగాయి.

ఇంకా 36 సీట్లు మిగిలా యి. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో 847 సీట్లకు 830 సీట్లు భర్తీకాగా, ఇంకా 17 సీట్లు నిండలేదు. 28 ప్రైవేట్‌ కాలేజీల్లో మొత్తం 1729 ఎంసీఏ సీట్లల్లో 1710 సీట్లు నిండాయి. ఇంకా 19 ఎంసీఏ సీట్లు మిగిలాయి. 1064 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకున్నప్పటికీ వారు సీట్లు పొందలేకపోయారు. ఎకనామికల్లి వీకర్‌ సెక్షన్‌ కోటా (ఈడబ్ల్యూఎస్‌) కింద 568 మంది ఇప్పటి వరకు ఐసెట్‌ సీట్లు పొందినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 1 వరకు సీటు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ట్యూషన్‌ ఫీజు చెల్లించి, రిపో ర్టింగ్‌ చేయాలని, లేకపోతే ఆ సీటు క్యాన్సిల్‌ అయిపోతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవిన్‌మిట్టల్‌ వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement