Tuesday, May 14, 2024

Huzurabad by poll: ప్రచారంలో ఈటల దూకుడు

హుజురాబాద్ ఉపఎన్నికు టైమ్ దగ్గర పడింది. ప్రచార పర్వం క్లైమాక్స్ కు చేరింది. దీంతో ఉన్న సమయంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీ అభ్యర్థులు తీవ్రంగా కష్ట పడుతున్నారు. హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విసృత్తంగా పర్యటిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం కనిపర్తిలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక గ్రామస్థులు భారీ స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నికల మండల ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ 15 మంది ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement