Sunday, April 28, 2024

TS : మెదక్ చర్చిలో ఈస్టర్ వేడుకలు…

మెదక్ సీఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని గుర్తు చేస్తూ పాటలు పాడారు. ఈస్టర్ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో చర్చి ఆవరణలో సందడి నెలకొంది.

కాగా, మెదక్ డయాసిస్ పరిధిలోని జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివ‌చ్చారు.

- Advertisement -

ప్రెస్ బిటరి ఇన్‌చార్జి రెవరెండ్ శాంతయ్య భక్తులకు దివ్య సందేశం ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు శిలువ ఊరేగింపుతో చర్చి ప్రాంగణంలో ఈస్టర్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళలు పెద్దఎత్తున కొవ్వొత్తులను వెలిగించి ఈస్టర్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలువను స్మరించుకున్నారు. దేవుడి పూజలు, ప్రత్యేక ప్రార్థనలతో చర్చి ప్రాంగణం మారుమోగింది. చర్చి ఉపాధ్యాయుల భక్తి సూక్తులు మధ్య భక్తిగీతాలు ఆలపించారు. యేసు సమాధి నుండి లేచి భక్తులకు అర్థమయ్యేలా వివరించాడు. కొంతమంది క్రైస్తవులు తమ సమాధుల వద్ద కొవ్వొత్తులను వెలిగించడం ద్వారా తమ ప్రియమైన వారిని గుర్తుంచుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement