Sunday, April 28, 2024

Exclusive | ముదిరాజ్​లకు ప్రాధాన్యం ఇవ్వాలి.. బండా ప్రకాశ్​తో మహాసభ నేతల భేటీ!

ఉమ్మడి మెదక్​ బ్యూరో, (ప్రభన్యూస్​): తెలంగాణలో ముదిరాజ్​లకు ప్రాధాన్యం ఇవ్వాలని, రాజకీయంగా అవకాశాలు కల్పించాలని కోరారు ముదిరాజ్​ మహాసభ నాయకులు. ఇవ్వాల (శనివారం) హైదరాబాద్​లో ముదిరాజ్​ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, మండలి డిప్యూటీ చైర్మన్​ డాక్టర్​ బండా ప్రకాశ్​తో వివిధ జిల్లాలకు చెందిన నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కలిగి ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గం రాజ్యాధికారంలో మాత్రం విస్మరణకు గురైతుందని వాపోయారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు దామాషా ప్రతిపాదికన ముదిరాజ్​లకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కోరారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న ముదిరాజులు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి మాత్రమే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో అత్యధిక జనాభాను కలిగివుండి సుమారుగా 60నియోజకవర్గాలలో గెలుపోవటములను ప్రభావితం చేసేలా ఉన్న తమ సామాజికవర్గం ప్రాధాన్యతకు నోచుకో లేకుండా పోయిందని అన్నారు. రాబోయే ఎన్నికలలో 10 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని, అదేవిధంగా బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​తో అపాయింట్​మెంట్ ఇప్పించాలని బండ ప్రకాష్ ని కోరారు.

అంతేకాకుండా.. ముదిరాజుల ఆకాంక్షలు వివిధ రాజకీయ పార్టీలకు తెలియజేసేలా త్వరలో ముదిరాజ్ ప్లీనరీ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి బండ ప్రకాష్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్​ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, ముదిరాజ్ విద్యావంతుల వేదిక చైర్మన్, ప్రొఫెసర్ దినేష్ ముదిరాజ్.. పటాన్​చెరు నియోజకవర్గం నేత నీలం మధు ముదిరాజ్, పులిమామిడి రాజు..  సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పట్నం మాణిక్యం ముదిరాజ్, దేవరకద్ర నియోజకవర్గం నుంచి మునిమోని సత్యనారాయణ ముదిరాజ్.. నిజామాబాద్ రూరల్ నుంచి ఇమ్మడి గోపి ముదిరాజ్, మునుగోడు నియోజకవర్గం నుంచి నారబోయిన రవి ముదిరాజ్, యువత రాష్ట్ర ప్రదానకార్యదర్శి అల్లుడు జగన్ ముదిరాజ్, WTITC గ్లోబల్ ప్రెసిడెంట్, మక్తల్ నియోజకవర్గం నుంచి సందీప్ మక్తాల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement