Sunday, April 28, 2024

కింగ్ ఫిష‌ర్ బీర్ కావాలి – క‌లెక్ట‌ర్ కు మందుబాబు మొర‌

హైదరాబాద్ తో సహా తెలంగాణ‌లోని చాలా చోట్ల మద్యం షాపుల్లో కింగ్ షిఫర్ బీర్లు దొరకట్లేదు. దీంతో జగిత్యాలకు చెందిన బీరం రాజేష్ అనే వ్యక్తి ప్రజావాణిలో చేసిన ఫిర్యాదుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జగిత్యాల పట్టణంలోని వైన్స్ షాపులు సిండికేట్ అయి కింగ్ షిఫర్ బీర్లు అమ్మడం లేదని ప్రజావాణిలో కలెక్టర్ బీఎస్ లతకు ఫిర్యాదు చేశాడు. అయితే తన బాధ కొందరికి హాస్యాస్పదమైనప్పటికీ రోజువారి మద్యం తాగేవారికి యూరిస్ యాసిడ్ ప్రాబ్లం వస్తుందని అన్నాడు. జిల్లాలోని కోరుట్ల,ధర్మపురి మండలాల్లొ కింగ్ ఫిషర్ బీర్లు అమ్ముతున్నారు కానీ జగిత్యాలలో అమ్మట్లేదు అని యువకుడు తెలిపారు. రాజేష్ కలెక్టర్ కు చేసిన ఫిర్యాదులో అన్ని రకాల బీర్లు అమ్ముతాం అని అనుమతిపొంది తర్వాత నాణ్యత లేని బీర్లును ప్రభుత్వ అనుమతి పొందిన మద్యం విక్రయ దుకాణంలో(వైన్స్,బార్)లలో అమ్ముతున్నారని తెలిపాడు.

వీటి ద్వారా ప్రజల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుందని తెలిపాడు. మద్యపానం చేసేవారు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లి నాణ్యమైనవి కొనుక్కొని వచ్చే క్రమంలో ప్రమాదానికి గురి కావడం జరుగుతుందన్నారు.. ధ‌ర్మ‌పురిలో దొరికే కింగ్ ఫిష‌ర్ జ‌గిత్యాల‌లో ఎందుకు దొర‌క‌డం లేదంటూ వాపోయాడు రాజేష్.. వేస‌విని దృష్టిలో ఉంచుకుని బ్రాండెడ్ బీర్ల‌ను మ‌ద్యం షాపుల‌లో విక్ర‌యించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కలెక్ట‌ర్ ను అభ్య‌ర్ధించాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement