Monday, May 6, 2024

రెజీనా కొత్త మూవీ ‘నేనే నా?’

రెజీనా ప్రధాన పాత్రలో, నిను వీడని నీడను నేనే ఫేమ్‌ కార్తీక్‌ రాజు దర్శకత్వంలో, రాజ్‌ శేఖర్‌ వర్మ నిర్మించిన ‘నేనే నా?’ చిత్రం వరల్డ్‌ వైడ్‌ థియేట్రికల్‌ నాన్‌-థియేట్రికల్‌ హక్కులను ఎస్పీ సినిమాస్‌ దక్కించుకుంది. రాజ్‌ శేఖర్‌ ఇంతకు ముందు సూపర్‌హిట్‌ చిత్రం ‘జాంబీ రెడ్డి’ నిర్మించారు. నేనే నా 1920, ప్రజంట్‌ – రెండు విభిన్న కాలాల నేపథ్యంలో తీసిన ఫాంటసీ – అడ్వెంచర్‌ థ్రిల్లర్‌. రెజీనా ఒక పురావస్తు శాస్త్ర వేత్త పాత్రను పోషిస్తుంది. ఆమె కొన్ని ప్రత్యేకమైన పురాతన వస్తువులను వెలికితీసే మిషన్‌ సమయంలో మిస్టీరియస్‌ సంఘటనలకు దారి తీస్తుంది. వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌, అక్షర గౌడ, జయప్రకాష్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సామ్‌ సిఎస్‌ సంగీతం సమ కూరుస్తున్న ఈ చిత్రానికి గోకుల్‌ బెనోయ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement