Thursday, April 25, 2024

వీడియో: బైకులపైకి దూసుకెళ్లిన డ్రైవర్ లెస్ ట్రాక్టర్

డ్రైవ‌ర్ లేని ఓ ట్రాక్టర్‌ బైకులపై దూసుకెళ్లింది. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. ఖాజీపేట్‌ గ్రామానికి చెందిన రమేష్‌ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌ను సర్వీసింగ్‌ చేయించి మెదక్‌ మార్గంలో గల ఓ వైన్స్‌ షాప్ సమీపంలో పార్క్‌ చేశాడు. అయితే, ఇంజిన్‌ ఆఫ్‌ చేయకుండానే ట్రాక్టర్ దిగి దుకాణానికి వెళ్లాడు. ఇంతలో ట్రాక్టర్‌ ఉన్నట్టుండి ముందుకు వెళ్లి రోడ్డు పక్కన ఉన్న బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమవ్వగా మరో పది బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇది గమనించిన ఓ వాహనదారులు వెంటనే బ్రేకులు వేసి ట్రాక్టర్‌ను ఆపారు. ఆ సమయంలో అక్కడ జనం ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement