Thursday, April 25, 2024

కొత్త లుక్‌లో అదరగొడుతున్నMSD

ఇండియాకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటతోనే కాదు.. తన స్టైల్ తోను అభిమానులను సంపాదించుకున్నాడు. టీమిండియాలోకి వచ్చిన కొత్తలో ధోని ఓ స్టయిల్ ఐకాన్ లా ఉండేవాడు..జులపాల జట్టుతో అభిమానులను అలరించేవాడు. ఆ తరువాత ఫంకీ ఎయిర్ స్టైల్ తో కూడా తన మార్క్ చూపించాడు.. అయితే మరోసారి తనలోని ఫ్యాషన్ లుక్ ని అభిమానులకు రుచి చూపించాడు ధోని. ధోనీ హెయిర్‌స్టైల్, లుక్ అద్భుతంగా ఉన్నాయని ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ధోని నయా లుక్ ఇప్పుడ వైరల్ గా మారింది. టెస్ట్‌, వన్ డే మ్యాచ్‌ల నుంచి త‌ప్పుకున్న ధోని పొట్టి క్రికెట్ ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిస సీజ‌న్స్‌లో అత్య‌ధిక‌సార్లు ఫైన‌ల్స్‌కు చేరుకున్న జ‌ట్టుగా సీఎస్‌కేకు పేరు ఉన్న‌ది.

ఇది కూడా చదవండి : Tokyo olympics: సెమీస్ లోకి దూసుకెళ్లిన పి.వి సింధు..

Advertisement

తాజా వార్తలు

Advertisement