Tuesday, July 16, 2024

మావోయిస్టులకు సహకరించొద్దు : సీపీ రేమా రాజేశ్వరి

చెన్నూర్: మావోయిస్టులకు సహకరించవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా నిల్వాయి, కొటపెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లంపల్లి, వెంచపెల్లి ప్రాణహిత నదీతీర మావోయిస్టు ప్రభావితా ప్రాంతాన్ని కమిషనర్ పర్యవేక్షించి ప్రజలతో మాట్లాడారు. అనంతరం పోలీసులు మీకోసం కార్యక్రమంలో గ్రామీణులకు నిత్యావసర వస్తువులు, బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మావోయిస్టులకు సహకరించ వద్దనీ, అనుమానాస్పద వ్యక్తులు గ్రామాల్లో కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఏసీపీ లు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement