Monday, May 20, 2024

అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు – ప్రజలకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు సూచన

భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా కరీంనగర్ కమిషనరేట్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. పరివాహక, లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలకు సహాయం అందించే కు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు.

కమీషనరేట్ పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని,అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసులకు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

భారీవర్షాల దృష్ట్యా ప్రజలు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి

విద్యుత్ తీగల కు దూరంగా ఉండవలెను.విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదు.

చిన్నపిల్లలను బయటకు రానేయకూడదు.

- Advertisement -

సాధ్యమైనంతవరకు ఇంట్లో గల ఎలక్ట్రానిక్ వస్తువుల కేబుల్స్ విడిగా ఉంచాలి.

పిడుగుపాటు దృశ్య వర్షం లో ఎవరు చెట్ల కింద ఆశ్రయం పొందరాదు. పొలాల వద్దకు రైతులు ఎవరు మొబైల్ ఫోన్స్ తీసుకుపోరాదు.

తీవ్రమైన ఈదురు గాలులు మరియు భారీ వర్షాల వలన చెట్లు విరిగి విద్యుత్ వైర్ల పై పడే ప్రమాదం ఉంది. ప్రజలు గమనించాలని సూచిస్తున్నాము.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులను ఆహారాన్ని జాగ్రత్త పరుచుకోవాలి.

కూలిపోయే స్థితిలో ఉన్న మట్టి గోడలతో ఉన్న ఇల్లులు పాత భవనాలు వెంటనే కాలి చేసి సురక్షత ప్రాంతాలకు వెళ్ళాలి.

వర్షాల కారణంగా రాకపోకలు స్తభించిపోయిన రహదారులను జాగ్రత్తగా దాటాలి.

రోడ్ల పై గల మ్యాన్ హోల్స్ కు దూరంగా నడవవలను.

వర్షం వల్ల బురదతో వాహనాలు జారే ప్రమాదం ఉంది.కావున పరిమిత వేగంతో నడపాలి. అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకి రావద్దు.

ఉదృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు రిజర్వాయర్లు,చెరువుల వద్దకు వెళ్ళరాదు.

వర్షాల కారణంగా ప్రబలే విషజ్వరాలు,అంటు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

సాధ్యమైనంతవరకు కాచి చల్లార్చిన నీటిని త్రాగడం వలన ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలి.

మీ క్షేమం – మా బాధ్యత. దయచేసి సూచనలు పాటించండి. కమీషనరేట్ పోలీస్ యంత్రాంగానికి సహకరించండి. అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం ఎదురైతే సహాయానికై వెంటనే సంబంధిత అధికారులు లేదా డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం 8712670744లకు సమాచారం అందించాలని కోరారు

    
Advertisement

తాజా వార్తలు

Advertisement