Monday, May 6, 2024

రూ.2 కోట్ల 80లక్షలతో అభివృద్ధి పనులు.. శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

భూపాలపల్లి/టేకుమట్ల (ప్రభ న్యూస్) : తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా విద్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు. జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలంలో రూ.2 కోట్ల 80లక్షలతో పలు అభివృద్ధి పనులకు భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి,జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ జక్కు హర్షిణితో కలిసి శంకుస్థాపన చేశారు . రాఘవపూర్ గ్రామంలో 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాఘవాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా రూ.7 లక్షలతో నిర్మించిన మౌళిక వసతులను ప్రారంబించారు.

అదే విధంగా టేకుమట్ల మండల కేంద్రంలో విద్యార్థిని, విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయ భవన నిర్మాణం కొరకు భూమి పూజ, పౌర పఠన మందిరమును ప్రారంభించారు. రామకిష్టాపూర్ (టీ) గ్రామంలోని మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా రూ.8 లక్షలతో నిర్మించిన అదనపు గదిని ప్రారంబించారు.అనంతరం అంకుషాపూర్ గ్రామంలోని కస్తూరీ భా పాఠశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా 2 కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న అధనపు గదులు,లాబ్, మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement