Tuesday, April 30, 2024

Devansh – అభిమాని కుమారుడికి నామ‌క‌ర‌ణం చేసిన బండి సంజ‌య్

క‌రీంన‌గ‌ర్ – బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఓ చిన్నారికి ‘‘దేవాన్ష్’’ అని నామకరణం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానారావుపేట గ్రామానికి చెందిన రాజశేఖర్ – స్రవంతి దంపతులు ఈరోజు ఉదయం కరీంనగర్ లో బండి సంజయ్ ను కలిశారు. తమ బాబుకు నామకరణం చేయాల్సిందిగా కోరారు. ఆ చిన్నారిని ఎత్తుకున్న బండి సంజయ్ ‘‘దేవాన్ష్’’ అని నామకరణం చేశారు.

అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ తాము బండి సంజయ్ వీరాభిమానులమని, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నానని అన్నారు. తమ బాబుకు సంజయన్న చేతుల మీదుగా నామకరణం చేయాలని ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నానని, ఆ అవకాశం ఇప్పుడు రావడంతో మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని రాజశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement