Sunday, April 28, 2024

Demand – టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ ను తొల‌గించాల్సిందే…..క‌విత డిమాండ్..

హైద‌రాబాద్ – టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న మహేందర్ రెడ్డి పైన జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేందర్‌రెడ్డిని పదవి నుంచి తొలగించాలని అన్నారు. కేసిఆర్ చేసిన పనులను తాము చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అబద్ధాలు చెప్పడం సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని హితువు పలికారు. నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు..

డిపెండెంట్ ఉద్యోగాలూ మీ ఖాతాలోనా…
సింగరేణిలో ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాలను ఇస్తోందని చెప్పారు. జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలను హైదరాబాద్ లో సీఎం స్థాయి వ్యక్తులు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ తామే ఉద్యోగాలు ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉండి కేసీఆర్‌ను ఇష్టానుసారం దూషిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగాలను ప్రభుత్వం ఆంధ్ర వారికి ఇస్తోందని ఆరోపించారు.

రేవంత్ అధికార దుర్వినియోగం..
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వాదించిన లాయర్లను సుప్రీంకోర్టులో అడ్వకేట్‌ ఆన్‌ రికార్డుగా నియ‌మించారంటూ. ఇదేం పద్దతి? ఇదేం న్యాయం? అని ప్ర‌శ్నించారు క‌విత . మొన్న‌టి వ‌ర‌కు రేవంత్ రెడ్డి జేబులో నుండి జీతం ఇచ్చి, ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్మును ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.. ఇలా నియ‌మించ‌డం . ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదా? కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఈ అంశంపై సీఎంను ఎందుకు నిలదీయడం లేదు? అంటూ ప్ర‌శ్నించారు..

నేను తెలంగాణ బిడ్డ‌ను కాదా..
రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అని కూడా అనలేదని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం నాలాగా ఉందని సీఎం అంటున్నారు. తానూ తెలంగాణ ఆడబిడ్డనే కదా అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి రేవంత్ మాట్లాడటం ఏంటీ? అని ప్రశ్నించారు.

క‌రంట్ కోత‌లు… ఆంధ్ర వాళ్ల పెత్త‌నం …
తెలంగాణలో కరెంట్ కోతలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వాళ్లని డైరెక్టర్‌లను నియమించారని అన్నారు. తెలంగాణ కు నిరంతర కరెంట్ ఇవ్వడంలో ఆంధ్రవాళ్లు ఏ మేరకు భాగస్వామ్యం అవుతారని ప్రశ్నించారు. మీలో పచ్చ రక్తం పారుతుంది కాబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీకి ఆంధ్ర స‌ల‌హాదారులు ఎందుకు? అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement