Sunday, April 28, 2024

TS : కూతురు ప్రేమ పెళ్లి..పిండ ప్ర‌దానం చేసిన తండ్రి

ఓ తండ్రి తన కూతురిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె అడిగినది కాదనక పెంచి పెద్ద చేశాడు. అయితే ఇప్పుడు తన తండ్రికి ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ తండ్రి..చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమై నెట్టింట వైరల్‌గా మారింది.

- Advertisement -

ఏం జరిగిందంటే… ప్రేమ పెళ్లి ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో తండ్రి చిలువేరి ముర‌ళి తన కూతురికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముర‌ళీ కుమార్తె అనూష ఇటివలే ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది. ఇలా కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న బాధను జీర్ణించుకోలేక తండ్రి త‌న భాద‌ను ఇలా వ్య‌క్తం చేశాడు. సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్ట్ చేసి బంధుమిత్రులందరికీ తన కూతురు చనిపోయిందని, పిండ ప్రదానాలు కూడా చేశాన‌ని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement