Tuesday, April 30, 2024

Forest fire: న‌ల్ల‌మ‌ల‌లో అగ్ని ప్ర‌మాదం…50హెక్టార్ల‌లో అట‌వీ ద‌గ్ధం…

న‌ల్ల‌మల అడ‌విలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. నాగర్ క‌ర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండ‌లం దోమ‌ల‌పెంట రేంజ్‌లో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంటకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో అధికారులు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువులకు ముప్పు వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement