Thursday, May 16, 2024

జోష్ నింపిన ఓటర్ల అవగాహన సైక్లింగ్ ర్యాలీ

కరీంనగర్ (ప్రభ న్యూస్)ఓటర్లు చాలా చైతన్యంగా మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తద్వారా అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని ఆచార్య ఎన్.మల్లేష్, కరీంనగర్ జిల్లా సైకిల్ అసోసియేషన్ చైర్మన్ వి.నరేందర్ రెడ్డి లు తెలియజేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ మరియు అల్ఫోర్స్ విద్యా సంస్థలు సంయుక్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డా॥కెప్టెన్. బి. మధుసుదన్ రెడ్డి, శ సురభి వేణుగోపాల్ , కార్యదర్శి లతో కలిసి స్థానిక తెలంగాణ చౌక్ వద్ద ఓటర్ల అవగాహన సైక్లింగ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా నిర్ణయాత్మక పాత్రను పోషించడమే కాకుండా అభివృద్ధికి చేయూతనిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యం విజయవంతం కాపడానికి ఓట్లు చాలా ఉత్తమమైన పాత్రను పోషించమే కాకుండా చైతన్యపర్చడంలో ప్రధాన భూమికను పోషిస్తుందని చెప్పారు. ఓట్లు వెలకట్టలేనివని, వసతుల కల్పనకు చాలా గొప్పగా వ్యవహరిస్తాయని మరియు భవిష్యత్త్ను నిర్దేశిస్తుందన్నారు. ఏ ప్రజాస్వామ్య దేశమైన విజయవంతం అవడానికై ఓటర్లను జాగృత పర్చాలని మరియు వారికి అన్ని వసతులను తప్పనిసరిగా అందించాలని చెప్పారు. కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చాలా స్పూర్తిదాయకంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

సైక్లింగ్ చేయడం వలన చాలా ఆరోగ్యంగా ఉంటామని, రోజువారి కార్యకలాపాలను ఉషారుగా నిర్వర్తించడమే కాకుండా రోగనిరోదక శక్తిని పెంపొందించడంలో చాలా కీలకంగా ఉంటుందని తెలుపుతూ సైక్లింగ్ను రోజు వారి పనిగా మలుచుకోవాలని విధిగా సైక్లింగ్ చేసి ఆరోగ్యకర జీవనాన్ని గడపాలని కోరారు. సైక్లింగ్ చేయడం వలన పలు వనరులు మిగులుతాయని మరియు జాతీయ ఆదాయం ప్రభావితం అవుతుందని కొనియాడారు.
18 సంవత్సరాలు నిండిన వారిలో చైతన్యం నింపడానికి, ఓటర్లుగా నమోదు చేసుకోని వారిని నమోదు చేసుకునే విధంగా ఉత్సాహం కల్గించడానికై భారీ సైక్లింగ్ ర్యాలిని చేపట్టడం జరిగినదన్నారు. ఈ ర్యాలీ తెలంగాణ చౌక్ నుండి ఆర్ & బి చౌరస్తా మీదుగా కోర్టు చౌరస్తా వరకు కొనసాగించామన్నారు.

డా॥ కెప్టెన్ బి. మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ సైక్లింగ్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించగలుగుతామన్నారు. ఓటు ద్వారా అభివృద్ధిని సాధించవచ్చని చెప్పారు. కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు సారధ్యంలో ఇప్పటికి ఎన్నో సందేశాత్మక మరియు ఆదర్శనీయమైన కార్యక్రమాలను చేపట్టామని మరియు భవిష్యత్లో పలు సందేశాత్మక అవగాహన ర్యాలీలను చేపటుతామని చెప్పారు.ఈ ర్యాలీకి విశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని తెలుపుతూ. ఈ ర్యాలి కేవలం తెలంగాణ చౌరస్తా నుండి కోర్టు చౌరస్తా వరకు కొనసాగుతుందని తెలిపారు. ర్యాలీ అనంతరం ఓటర్లు చేత ప్రతిజ్ఞ చేయిచండం జరిగిందని చెప్పారు. ఈ ర్యాలీలో సుమారు 250 మందికి పైగా విద్యార్థులు పాల్గొని ఓటు హక్కును వినియోగించుకో…. దేశాన్ని రక్షించుకో, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి దిక్కు అనే నినాదాలతో నగారాన్ని మారుమోగించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బాద్యులు. కోచ్ లు, క్రీడాకారులు, ఉపాద్యాయులు, అధ్యాపకులు, తల్లితండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement