Saturday, May 18, 2024

హైదరాబాద్ లో వ్యాక్సినేషన్.. సీఎస్ ఆకస్మిక తనిఖీ

గ్రేటర్ హైదరాబాద్ లో నేటి నుండి ప్రారంభించిన రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. శనివారం నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సన్ రైజ్ హోమ్ కాలనీలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సిఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సి.ఎస్. మాట్లాడుతూ  రాష్ట్రంలో ఇప్పటికే మూడు కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ లను అందించామని తెలిపారు. కరోనా నివారణకు కేవలం వ్యాక్సిన్ తీసుకోవడమే మార్గమని పేర్కొన్నారు. హైదారాబాద్ నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. నేటి నుండి పది రోజులపాటు ఏర్పాటు చేసిన 150  మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ రోజూ దాదాపు 450 కాలనీలను కవర్ చేస్తామని అన్నారు. అవసరమైతే వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరిన్ని రోజులు పొడగించనున్నట్టు లోకేష్ కుమార్ వివరించారు.

ఇది కూడా చదవండి: Save vizag steel plant: పవన్ నిర్ణయంతో మార్పు తథ్యం

Advertisement

తాజా వార్తలు

Advertisement