Friday, May 17, 2024

CPI Protest – బిజెపి వైఖరికి సభ్య సమాజం తలదించుకుంటుంది – పానుగంటి

షాద్ నగర్ జూలై 25 ప్రభ న్యూస్ మణిపూర్ రాష్ట్రంలో జాతుల సమస్య ఉద్యమం ఉదృతమై మహిళలను వివస్త్రాలను చేసి అత్యాచారం చేసిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని, దీనికి నైతిక బాధ్యత వహించి మణిపూర్ ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖ మంత్రి రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు
మణిపూర్ లో శాంతి నెలకులపాలని ఆ ఘటనకు బాధ్యత వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు షాద్నగర్ పట్టణంలో నీ అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ మరియు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. .

ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ ఎక్కడో జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగిన మన ప్రధానమంత్రి మనదేశంలో చిన్న రాష్ట్రమైన ఈశాన్య రాష్ట్రంలో జరుగుతున్న జాతుల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ఆయన నిలదీశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కులతత్వాన్ని మతతత్వాన్ని జాతుల మధ్య వైరుధ్యాన్ని ప్రాంతాల మధ్య వైరుధ్యాన్ని పెంచి పోషిస్తున్నదని దీని ఫలితమే మణిపూర్లో జరిగే అల్లర్లు అని ఆయన తెలిపారు. ఉమ్మడి పౌర స్మృతి దేశ సెక్యులరిజానికి దేశ ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం కలిగించేదని భిన్న మతాలు భిన్న కులాలు జాతులు సాంప్రదాయాలు కలిగిన భారత దేశంలో ఉమ్మడి పౌర స్మృతి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.

మణిపూర్ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసే వరకు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు మరింత ఉదృతంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధుల జంగయ్య టంగుటూరి నరసింహ రెడ్డి శ్రీను నాయక్ నాయకులు ఈశ్వర్ నాయక్ నాయకులు మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో గోవింద్ నాయక్ ఎండి షకిల్ గడ్డం జంగయ్య వెంకటేష్ ఎం పవన్ చౌహన్ శ్రీకాంత్ లింగం నాయక్ చంద్రబాబు కురుమయ్య చంద్రమౌళి లక్ష్మి రాజశేఖర్ మహిళా నాయకురాలు లక్ష్మి మైసయ్య లక్ష్మయ్య మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement