Tuesday, May 14, 2024

CPI Protest – మహిళల మాన ప్రాణాలను హరించేెందుకేనా డబుల్ ఇంజన్ సర్కార్లు..? మోడీని నిల‌దీసిన సిపిఐ

హనుమకొండ : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం హయాంలో దేశంలో మహిళలకు రక్షణ కరువైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మణిపూర్ లో మహిళలపై జరిగిన అమానుష ఘటనకు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం జాతీయ సమితిల పిలుపు మేరకు మంగళవారం హనుమకొండలోని కాళోజీ జంక్షన్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మణిపూర్ ఘటనలో బాధితులకు సంఘీభావం తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు.

ఈ నిరసన ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి మహిళకు, పేద, బడుగు, బలహీన, దళిత గిరిజన వర్గాలపై దాడులు పెరిగాయని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలోనే ఈ వర్గాల ప్రజలకు పూర్తిగా రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండి డబుల్ ఇంజన్ సర్కార్లు రావాలని చెబుతున్న బిజెపి మణిపూర్ లో మాదిరిగా మహిళల మాన ప్రాణాలను హరించేెందుకేనా డబుల్ సర్కార్లు రావాలని కోరుకునేదని ప్రశ్నించారు. మణిపూర్ ఘటన జరిగి మూడు నెలలు కావస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు కు సమాధానం చెప్పలేదని అన్నారు.

మణిపూర్ ఘటనపై తక్షణమే అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారాలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, నకీర్త ఓదెలు,కొట్టెపాక రవి, మునిగాల బిక్షపతి, జక్కు రాజు గౌడ్, మంచాల రమాదేవి, బాషబోయిన సంతోష్,బొట్టు బిక్షపతి, కుమార్,స్వరూప,సిపిఎం జిల్లా నాయకులు నోముల కిషోర్, భానూ నాయక్, టి. మల్లేషం, కె. కుమారస్వామి, యాకయ్య, ఓరుగంటి సాంబయ్య, రమ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement