Sunday, April 28, 2024

COVID Cases – కొత్త గా ఎనిమిది పాజిటివ్ కేసులు – మరణాలు లేవన్న మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్ – గడిచిన 24 గంటల్లో తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 59 మంది కొవిడ్ చికిత్సను పొందుతున్నారు. ఈ రోజు 1,333 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మరో ముప్పై మంది నివేదికలు రావాల్సి ఉందితాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,44,566కి పెరిగింది. కొత్తగా నలుగురు కోలుకోగా ఇప్పటి వరకు 8,40,396 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు..

మరణ వార్తలను ఖండించిన మంత్రి దామోదర రాజనర్సింహ

తెలంగాణలో కొవిడ్ కారణంగా ఎవరూ మరణించలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం స్పష్టం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, వారికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు. రాష్ట్రంలో కొవిడ్ మరణాలు ఇప్పటి వరకు నమోదు కాలేదన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో చనిపోయిన వారికి అనేక రకాల రోగాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలిపారు. కొవిడ్ మరణం అని వార్తలు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు.. తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement