Friday, March 1, 2024

Counter – కాంగ్రెస్ సునామీ వస్తుందని తెలిసీ ఐటీ,ఈడి సోదాలు చేయిస్తున్న మోడీ – కేడీలు …. రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇళ్ల పై ఐటీ దాడులు జరుగుతున్న అంశంపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? అని ఆగ్రహించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ – కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇదని ఆగ్రహించారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం అని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement