Wednesday, May 15, 2024

Counter – కెసిఆర్ పై విమ‌ర్శ‌లా… తుమ్మ‌ల‌పై విరుచుకుప‌డ్డ పువ్వాడ ..

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో సర్పంచ్ మెంటెం రామారావు అధ్వర్యంలో, ఖమ్మం నగరం 5వ డివిజన్ బాలాజీ నగర్ నందు జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ, ఇక్కడ ఒక అబద్దాల కోరు కాంగ్రెస్ నుండి వస్తున్నాడు.. ఆయన మాటలు నమ్మితే నట్టేట ముంచడం ఖాయమని అన్నారు.

ఆయన నా పై ఓటమి చెంది మూలకు కూర్చుంటే కేసీఅర్ పిలిచి మంత్రి పదవి ఇస్తే ఆయన జిల్లా కు చేసింది శూన్యం అన్నారు. పైగా కనీసం ఆ విజ్ఞత కూడా లేకుండా ఎదురు కేసీఅర్ నే దూషించడం విచారకరమన్నారు. పచ్చి అబద్ధాలు కొరు.. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు తప్ప ఒక్కటైన నిజాయితీగల మాట తుమ్మల నోట రాదన్నారు. మీ విలువ ఎంటో, నిన్న కేసీఅర్ స్పష్టంగా చెప్పారని, నమ్మిన వారి గొంతును తడి గుడ్డతో కోయడంలో తుమ్మల ను మించిన ఘనుడు లేడన్నారు.

తుమ్మల ను కేసీఅర్ రు మిత్రుడు అని సంబోధిస్తారు తుమ్మల మాత్రం కనీస గౌరవం లేకుండా ఉద్యమ నేత కేసీఅర్ ని దూషించడం బాధాకరం అన్నారు. నీకు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ని చేసి, పాలేరు ఉప ఎన్నికల్లో ఎమ్మేల్యే టికెట్ ఇచ్చి న కేసీఅర్ పై ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడటం మి సంస్కారంకు నిదర్శనం అన్నారు.

- Advertisement -

తుమ్మల అనే వ్యక్తి ఆయన ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ ఎమ్మేల్యే లను దగ్గరుండి ఓడించారని అందుకే ప్రతి సారి తుమ్మలకు మంత్రి పదవి వచ్చింది అన్నారు. సీతా రామ ప్రాజెక్ట్ కోసమే BRS లోకి వచ్చా అని గొప్పలు చెప్తున్నా తుమ్మల నువ్వు గతంలో మంత్రి ఉన్న సమయంలో ఎందుకు చేయలేకపోయావు.. ఆ ప్రాజెక్ట్ ఆలోచన కేసీఅర్ కి ఇప్పుడు కాదు ఉద్యమ సమయంలోనే ఉందన్నారు. గతంలో నీటిపారుదల మంత్రిగా ఉన్న అప్పుడు ఎందుకు చేయలేదు దమ్ముంటే చెప్పాలన్నారు.
మీకు రాజకీయ జీవితం ఇచ్చిన NTR గారి మీద చెప్పులు వేయించిన ఘనమైన చరిత్ర నీది అని అన్నారు.

తుమ్మల నాగేశ్వర రావు పదవి వ్యామోహం తప్పితే వేరే ఏమీ లేదన్నారు. ఆయన రాజకీయంలో ఉన్న 40ఏళ్ల కాలంలో అన్ని వెన్ను పోటు పొడిచిన ఘనత నీదే అన్నారు. నాలుక కు నరం లేదు అని కేసీఅర్ గారు అన్నది ఈ మహనుభావుడి గురించే అని అన్నారు. నాకు మంత్రి పదవి ఇవ్వటానికి తుమ్మలను కేటిఆర్ గారు ఓడించడానికి ప్రతిపక్ష అభ్యర్థికి డబ్బులు పంపాడని ఆరోపణ చేయడాని తీవ్రంగా ఖండించారు. నిన్ను ఓడగొట్టడనికి కేటిఆర్ గారు రావాలా..? నువ్వు అంత మొనగాడివి అయితే నా చేతిలో ఎలా ఓడిపోయావు…? పాలేరు అభ్యర్థిపై ఎలా ఓడిపోయావు అన్న విషయం కూడా అర్దం కాలేదా..

నువ్వూ నా చేతిలో ఓడపోయినపుడే నీ బలం, నీ నిబద్దత, నీ నిజాయితీ ఎంటో రుజువు అయింది కదా.. ఆ మాత్రం సోయి ఉండాలి కదా తుమ్మల నీకు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయ అవకాశవాదులకు ఖమ్మం ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నా అని అన్నారు. నిన్ను నమ్మిన వ్యక్తికే వెన్నుపోటు పొడిచిన నిన్ను ఇంకా ప్రజలు నమ్మాబొరని, వచ్చే ప్రభుత్వం మనదే.. గెలిచేది మనమే కాంగ్రెస్ ను తుమ్మలను ఇక ప్రజలు పూర్తిగా మార్చిపోతారని చెప్పారు.

ముందుగా గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అమ్మ వారి ఆశీర్వాదం అందుకున్నారు.
ఈ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, AMC చైర్మన్ దొరేపల్లి శ్వేత, ఉప సర్పంచ్ కే వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు వీరు నాయక్, నాయకులు మందడపు నర్సింహారావు, కుర్రా భాస్కర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాతా వెంకటేశ్వర్లు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసి రాంబాబు, సంగయ్య, కేతినేని సీతరామయ్య, కార్పొరేటర్ లు దండా జ్యోతి రెడ్డి, నాగండ్ల కోటి, తొట్టి ఉమా రాణి, వలి, కొలేటి రాధా కృష్ణ, వంటికొమ్ము శ్రీనివాస్ రెడ్డి, కొమరయ్య, బొల్లి రాములు, సురగాని బాబు, గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement